Page Loader
Allu Arjun: విజయ్‌ దేవరకొండ నుంచి బన్నీకి గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన అల్లు అర్జున్‌
విజయ్‌ దేవరకొండ నుంచి బన్నీకి గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన అల్లు అర్జున్‌

Allu Arjun: విజయ్‌ దేవరకొండ నుంచి బన్నీకి గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన అల్లు అర్జున్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ కలిగిన స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అభిమానులకు కనిపించింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని వెల్లడించిన ఈ ఇద్దరు హీరోలు తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్‌లో తన బ్రాండ్ అయిన 'రౌడీ' స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు రౌడీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్సులు పంపడమే కాకుండా, పిల్లల కోసం బర్గర్లు కూడా గిఫ్ట్‌గా పంపించారు.

Details

గతంలోనూ గిఫ్ట్ పంపిన విజయ్

దీనికి సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియా స్టోరిలో షేర్ చేస్తూ, "మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ స్పందించారు. ఇది మొదటిసారి కాదు. గతంలో 'పుష్ప 2' విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ అల్లు అర్జున్‌కు 'పుష్ప' పేరుతో ప్రత్యేకమైన టీషర్టులు గిఫ్ట్‌గా పంపిన విషయం తెలిసిందే. వాటిని స్వీకరించిన బన్నీ అప్పట్లో కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. దీనికి విజయ్ కూడా 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయంటూ ప్రేమపూర్వకంగా స్పందించారు.

Details

కింగ్ డమ్ తో బిజీగా విజయ్ దేవరకొండ 

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ చిత్రానికి సిద్ధమవుతుండగా, ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనంతరం త్రివిక్రమ్ శ్రీనుతో మరో చిత్రం చేయనున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.