Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 23న ఆంటోనీని మహిళా తొక్కిసలాటకు ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంటోనీ సాధారణంగా సినిమా ఈవెంట్‌లలో బౌన్సర్‌గా పనిచేస్తాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటన సమయంలో కూడా ఆయన బన్నీకి సెక్యూరిటీగా ఉన్నాడు. త్వరలో ఆంటోనిని సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లేలా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది.
రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ విచారణ
ఈ విచారణలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ పాల్గొన్నారు. అల్లు అర్జున్, న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరిగింది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పోలీసులు, అల్లు అర్జున్‌ను దాదాపు రెండున్నర గంటల పాటు విచారించారు. ఆయనకు 20కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కొన్నిచోట్ల అల్లు అర్జున్ తెలియదని, మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది.