ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో
ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కార్లో వెళ్తున్న అల్లు అర్జున్, అల్లు అర్హను ఆడిస్తూ కనిపించాడు. ఆ టైమ్ లో బ్యాగ్రౌండ్ లో ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అనే నిరీక్షణ సినిమాలోని పాట రాగం ప్లే అవుతోంది. ఆ రాగానికి, వీడియోకు మంచి సింక్ కుదరడంతో నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోకు విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. క్యూట్ వీడియో అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరేమో ఆ పాట రాగం మళయాల సినిమాలోనూ ఉందని గుర్తు చేస్తున్నారు.
శాకుంతలం లో భరతుడిగా కనిపించిన అల్లు అర్హ
అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ అల్లరి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా అల్లు అర్హ, వెండితెర మీద కనిపించింది. శాకుంతలం సినిమాలో శకుంతల కొడుకుగా భరతుడి వేషంలో నటించింది. ఈ పాత్రలో చేసిన అల్లు అర్హకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా అల్లు అర్హ మాటలు బాగున్నాయని అన్నారు. అదలా ఉంచితే, పుష్ప 2 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప 2 నుండి వచ్చిన వేర్ ఈజ్ పుష్ప వీడియోకు యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం, వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల కానుందని అంటున్నారు.