
జాతీయ చలనచిత్ర అవార్డులు: వైట్ సూట్ లో అల్లు అర్జున్, సింపుల్ గా స్నేహారెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అవార్డుకు ఎంపికైన సినిమా సెలబ్రిటీలందరూ హాజరు అవుతున్నారు.
అయితే అందరిలోకి అత్యంత ఆసక్తి కలిగిస్తుంది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు.
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవానికి సతీమణి స్నేహ రెడ్డితోపాటు అల్లు అర్జున్ విచ్చేశారు.
వైట్ సూట్ లో అల్లు అర్జున్ స్టయిలిష్ గా కనిపిస్తున్నారు. పుష్ప 2 హెయిర్ స్టయిల్, గడ్డంతో మరింత స్టయిలిష్ గా అల్లు అర్జున్ మెరిసిపోతున్నారు.
ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి బ్రౌన్ కలర్ చుడీదార్ లో సింపుల్ గా ఉన్నారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట చూడముచ్చటగా కనిపిస్తోంది.
Details
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఫోటోలు
ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలోని అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ తో పాటు పుష్ప చిత్ర బృందం కూడా ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవానికి హాజరవుతుంది.
పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. అలాగే పుష్ప సినిమాలోని పాటలకు గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ అవార్డు దక్కించుకున్నారు.
జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం కోసం పుష్ప చిత్ర బృందం మొత్తం ఢిల్లీలో ఉండడం వల్ల పుష్ప 2 చిత్రీకరణ ఆగిపోయింది.
ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత మళ్లీ పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో అల్లు అర్జున్
#ScrollandPlay Exclusive:@alluarjun with wife #AlluSnehaReddy at National Film Awards ❤️#AlluArjun #AlluSnehaReddy #NationalFilmAwards #ScrollandPlay #Pushpa2TheRule pic.twitter.com/WV0O7uDdXx
— Scroll & Play (@scrollandplay) October 17, 2023