Page Loader
AA23 : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?

AA23 : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అల్లు అర్జున్‌కు మరో తిరుగులేని విజయాన్ని అందించింది. ఈ సినిమా ద్వారా హిందీలోనూ బన్నీ క్రేజ్ దూసుకెళ్లడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండగా, ఇప్పుడు అందులో తమిళ దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ కూడా చేరింది. 'జవాన్' బ్లాక్ బస్టర్ తర్వాత కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అట్లీ, అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా ఒక కథ సిద్ధం చేశాడట. ఇటీవల బన్నీతో భేటీ అయిన అట్లీ, తన కథను వినిపించగా, అది అల్లు అర్జున్‌కు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.

Details

ఏప్రిల్ లో ప్రీ-ప్రొడక్షన్ పనులు

ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించనున్నారని, బన్నీతో పాటు మరో తమిళ హీరో కూడా ఇందులో కనిపించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అట్లీ టీమ్ షూటింగ్ టైమ్‌లైన్‌లు, ఇతర లాజిస్టిక్స్‌పై కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ లేదా మే నాటికి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని అట్లీ భావిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.

Details

ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని, అందులో ఒకరుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలో తాజా సంచలనం అయిన అభయంకర్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అభయంకర్ పని చేయనున్నాడట. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌తో రాబోయే ఈ మాస్ ఫీస్ట్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనుందని చెన్నై సినీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.