
Allu Arjun: బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇప్పటికే,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాని ఆగష్టు 15,2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ రోజు నుండి జరగనున్న ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అల్లు అర్జున్ బెర్లిన్‌కు బయలుదేరారు.
బుధవారం ఉదయం ఆయన విమానాశ్రయంలో దర్శనమిచ్చారు.ఆయన పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
కాగా,సెట్స్‌పై ఇతర నటీనటులతో పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ విమానాశ్రయంలో అల్లు అర్జున్
Icon star 🌟 @alluarjun is en route to Germany 🇩🇪 to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa #Berlinale pic.twitter.com/0hHRZjdMks
— Allu Arjun Official (@TeamAAOfficial) February 15, 2024