AlluArjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్.. భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప 2 సినిమా ఒక నెల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
జనవరి 17 నుండి 20 నిమిషాల కొత్త సీన్స్‌తో రీ లోడెడ్ వెర్షన్‌గా విడుదల చేసిన మేకర్స్, థియేటర్లో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
పుష్పరాజ్ హవా నార్త్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ సినిమా తర్వాత, అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో భారీ ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమా ప్రారంభం ఈ నెలాఖరులో ఉండనున్నట్లు సమాచారం.
Details
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు
ఈ సినిమా ప్రారంభం ముందు, బన్నీ కొత్త లుక్‌తో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయనున్నాడు.
ఇప్పటి వరకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ మధ్య వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధించాయి.
ఇప్పుడు మరోసారి వీరద్దరి కాంబో ముందుకు రానుంది. భారీ బడ్జెట్, మైథలాజికల్ టచ్‌తో సినిమా రూపొందించే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.
పుష్ప 2 విజయంతో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.