Allu Arjun: నేడు విచారణకు రండి.. అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఆయనను ఏ11 నిందితుడిగా పేర్కొంటూ మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో "పుష్ప 2" ప్రీమియర్‌షోను చూడటానికి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి, రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు
పోలీసులు ముందుగా అనుమతి నిరాకరించినప్పటికీ, ర్యాలీ నిర్వహించడం ద్వారా ఈ ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో, పోలీసులు ఆయన్ను విచారించేందుకు సిద్ధమయ్యారు