Allu sirish: అల్లు వారి పెళ్లి సందడి.. పవన్ కళ్యాణ్, నాగబాబులకు శుభలేఖ అందజేత
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి పీక్స్‌కు చేరింది. ఒకవైపు పసుపు దంచే కార్యక్రమాలు, మరోవైపు బ్యాచిలర్ పార్టీలతో గత కొన్ని రోజులుగా శిరీష్-నయనికల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబును వివాహానికి ఆహ్వానించారు. సతీసమేతంగా వారి నివాసాలకు వెళ్లిన అల్లు అరవింద్ నూతన వస్త్రాలు అందజేసి శుభకార్యానికి పిలిచారు. మార్చి 6న అల్లు శిరిష్ - నయనిక వివాహ బంధంతో ఒక్కటుకానున్నారు. ఈ వేడుకకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఇటీవలే పసుపు దంచే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Details
అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడకకు హాజరు
హైదరాబాద్‌లోనే ఈ వివాహం నిర్వహించనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు పెళ్లికి ముందు దుబాయ్‌లో ఫ్రెండ్స్ సర్కిల్‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఫిబ్రవరి 20న అల్లు అర్జున్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ దంపతులతో పాటు శ్రీలీల, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా తదితరులు హాజరై సందడి చేశారు.