LOADING...
Nikhil : పాన్‌ ఇండియా సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌.. నిఖిల్‌ ప్లానింగ్‌ సూపర్‌!
పాన్‌ ఇండియా సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌.. నిఖిల్‌ ప్లానింగ్‌ సూపర్‌!

Nikhil : పాన్‌ ఇండియా సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌.. నిఖిల్‌ ప్లానింగ్‌ సూపర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా స్వయంభుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌ పవర్‌ఫుల్‌ యోధుడిగా కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ సృష్టించగా, సినిమాను రెండు భాగాలుగా (పార్ట్‌ 1 & పార్ట్‌ 2) విడుదల చేయనున్నట్లు నిఖిల్‌ స్వయంగా వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ 2026 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా ప్రకటనలతో అభిమానులకు నిఖిల్‌ వరుస సర్ప్రైజ్‌లు ఇచ్చారు.

Details

త్వరలోనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ

రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించడమే కాకుండా, త్వరలోనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు చెప్పి ఆసక్తిని రేకెత్తించారు. ఇప్పటి వరకు వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిఖిల్‌, ఇక ఓటీటీ ప్రపంచంలోనూ గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నట్లు, దానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిఖిల్‌ లైనప్‌ కూడా ఆకట్టుకుంటోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న కార్తికేయ 3, రామ్‌ వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ద ఇండియన్ హౌస్ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలన్నీ నిఖిల్‌ స్టార్‌డమ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement