
Amar Deep-Supritha : బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమాలో హీరోయిన్‌గా సురేఖా వాణి కూతురు
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్‌దీప్ తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.
ఇప్పుడు హీరోగా వెండితెర పై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, మాస్ మహారాజ రవితేజ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నారు.
కాగా,రాబోయే ప్రస్తుతం అమర్‌దీప్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ కొత్త సినిమా ఓపెనింగ్ నేడు హైదరాబాద్ లో జరిగింది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తె సుప్రీత అరంగేట్రం చేయనుంది.
Details
"ప్రొడక్షన్ నెం. 2" టైటిల్‌తో ప్రారంభమైన చిత్రం
సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె రీల్స్, వ్లాగ్‌లు, వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి.
"ప్రొడక్షన్ నెం. 2" అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఎం3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినోద్ కుమార్, రూప లక్ష్మి, ఎస్తేర్, రాజా రవీంద్ర నటిస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.