Amaran : 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరక్కెక్కిన ఈ సినిమా భారత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కింది. మలయాళ నటి సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, సోనీ పిచర్స్ సంయుక్తంగా నిర్మించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో విడుదలైన 'అమరన్' వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ టాక్ పొందింది. ఈ చిత్రం విడుదలైన నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టింది.
డిసెంబర్ 5న రిలీజ్
దీంతో శివ కార్తికేయన్‌కు కెరీర్ బెస్ట్ హిట్ అందించింది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. 'అమరన్' డిసెంబరు 5 నుండి తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుంది. దీపావళి తర్వాత, థియేట్రికల్ విండో 35 రోజుల తరువాత ఈ సినిమా ఓటీటీకి వస్తోంది.