Coolie : అమెజాన్ ప్రైమ్ చేతికి 'కూలీ'.. రికార్డు సృష్టించిన ఓటీటీ డీల్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కూలీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
పలు కారణాల వల్ల కొంతకాలంగా షూటింగ్ వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ తాజా షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది.
రజినీకాంత్‌తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, శ్రుతి హాసన్ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
Details
భారీ ధరకు అమ్ముడైన ఓటీటీ రైట్స్
'కూలీ' సినిమాపై ఉన్న భారీ క్రేజ్ ఓటీటీ రైట్స్ విషయంలో మరోసారి రుజువైంది.
ఇప్పటికే పలువురు కొనుగోలుదారులు భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉండగా, తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ.120 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Details
హైబజ్ క్రియేట్ చేస్తున్న 'కూలీ'
సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అటు రజినీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తిని రేపుతోంది.
ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా 2024 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.