తదుపరి వార్తా కథనం

Ambati Arjun: అంబటి అర్జున్‌కు బంపర్ ఆపర్... రామ్ చరణ్ సినిమాలో సూపర్ క్యారెక్టర్
వ్రాసిన వారు
Stalin
Nov 13, 2023
11:51 am
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తిగా సాగుతోంది. దీపావళి స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో కంటెస్టెంట్లకు సంబంధించిన ఇద్దరిని హోస్ట్ నాగార్జున స్టేజీపైకి పిలిచి వారితో మాట్లాడించారు.
హౌస్‌లో టాప్-5 కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు అనేది వారితో చెప్పించారు.
ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ కోసం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.
అంతేకాదు, బిగ్‌బాస్ స్టేజ్‌పై అర్జున్‌కు బుచ్చిబాబు దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తాను రామ్ చరణ్‌తో తీయబోయే సినిమాలో అర్జున్ నటించబోతున్నట్లు ప్రకటించాడు.
అంతేకాకుండా ఆ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ సూపర్‌గా ఉంటుందని వెల్లడించారు. బుచ్చిబాబు ఈ ప్రకటన చేయగానే, అర్జున్ ముఖం మతాబులా వెలిగిపోయింది.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి