
Amitabh Bachchan: పుష్పలో బన్నీ నటనకు అమితాబ్ ఫిదా.. 'శ్రీవల్లి' డ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ చెప్పులు వదిలేసి చేసిన డ్యాన్స్ స్టెప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రోగ్రాంకు హాజరైన భువనేశ్వర్‌కు చెందిన ఇప్సితా దాస్‌ను 20,000 రూపాయల ప్రశ్నగా.. '2023లో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత ఎవరు?' అని అడిగారు. దీనికి అల్లు అర్జున్ అని దాస్ సమాధానం చెప్పారు.
ఈ సనిమాలో బన్నీ నటన అద్భుతంగా ఉందని అమితాబ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సినిమాలోని శ్రీవల్లి పాటలో స్టెప్‌పై కీలక వ్యాఖ్యలు చేసారు. చెప్పులు వదిలేస్తే వైరల్ అవడం మొదటిసారి చూసినట్లు చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చెప్పులు వదిలేస్తే వైరల్ అవడం మొదటిసారి చూశా: అమితాబ్
Amitabh Bachchan in awe of Allu Arjun's exceptional acting in Pushpa; talks about his iconic viral dance stephttps://t.co/gWXBkCaRBh
— solovakia Ns (@NsSolovakia) November 8, 2023