NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం

    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 06, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి.

    ఈ మేరకు అమితాబ్ బచ్చన్, తన బ్లాగులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ముంబైలో తన నివసంలో ఉన్నట్లు, విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్ల్డి చేసారు.

    ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి బయలుదేరినట్లు, అక్కడ సీటీ స్కాన్ జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముంబైకి చేరుకున్నట్లు సమాచారం.

    గాయం మానడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చని, అప్పటి దాకా విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతానికి షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని తన బ్లాగులో రాసుకొచ్చారు అమితాబ్.

    ప్రాజెక్ట్ కె

    జల్సా గేటు వద్దకు అభిమానులను రావొద్దంటూ అమితాబ్ పిలుపు

    ముంబైలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అమితాబ్, జల్సా గేట్ వద్దకు రావొద్దని తన అభిమానులకు తెలియజేసాడు. ప్రతీ వారం జల్సా గేటు వద్ద తన అభిమానులను పలకరిస్తూ కనిపిస్తాడు అమితాబ్.

    అమితాబ్ ను కలుసుకోవడానికి చాలామంది జనం అక్కడ గుమిగూడతారు. అయితే ఈ సారి అక్కడికి రావొద్దని, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటానని అమితాబ్ అన్నారు.

    మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపిస్తే, బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్ గా కనిపిస్తోంది.

    ఈ సినిమాలో ఆధునిక విష్ణువు అవతారంలో ప్రభాస్ కనిపిస్తారని చిత్ర నిర్మాత అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. 2024 జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమితాబ్ ఆక్సిడెంట్ గురించి ప్రముఖ వెబ్సైటు ట్వీట్

    "In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult scan by CT at AIG Hospital in Hyderabad flown back home," posts Amitabh Bachchan.

    (pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL

    — ANI (@ANI) March 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రాజెక్ట్ కె
    సినిమా

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా

    సినిమా

    బాలీవుడ్: షారుక్ ఖాన్ బ్లూ వాచ్ ఖరీదుతో రెండు చిన్న సినిమాల నిర్మాణం సినిమా
    ఓ మై డార్లింగ్ మూవీ కోసం బుట్టబొమ్మ లిప్ కిస్ సినిమా
    పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న షారుక్ ఖాన్ డీడీఎల్జే సినిమా
    కాంతార: వరాహరూపం పాటను తీసేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025