Director Son: తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా అమితోవ్ డెబ్యూ.. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఇవ్వడం సహజమే. హీరోల నుంచి హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల వారసులు కూడా వివిధ రంగాల్లోకి అడుగుపెట్టడం సాధారణంగా మారింది. వారసులలో కొందరు తమ ప్రతిభను చాటుతూ సక్సెస్ అవుతుంటే, మరికొందరు తమ స్థానం కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు. ఇప్పుడు మరో దర్శకుడి కుమారుడు హీరోగా పరిచయమవ్వడానికి రంగం సిద్ధమైంది. డైరక్టర్ తేజ, తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి.
డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం
నవంబర్ లేదా డిసెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దర్శకుడు తేజ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన చివరిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మంచి విజయాన్ని సాధించినా, దగ్గుబాటి అభిరామ్ హీరోగా చేసిన 'అహింస' మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈసారి తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేయడానికి తేజ స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.