తదుపరి వార్తా కథనం

Devara : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2024
05:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు రెండో సాంగ్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు.
సెకండ్ సింగిల్‌ను ఆగస్టు 5న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్ స్టెప్పులేసిన ఫోటోను పంచుకున్నారు.
Details
కొత్త లుక్ లో తారక్
తారక్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రొమాంటిక్ సాంగ్ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ వేస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
దేవర పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.