Page Loader
Maruthi Nagar Subramanyam: రావు రమేష్ హీరోగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల  
రావు రమేష్ హీరోగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

Maruthi Nagar Subramanyam: రావు రమేష్ హీరోగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో అనేక చిత్రాలలో బహుముఖ పాత్రలకు పేరుగాంచిన నటుడు రావు రమేష్, లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన "మారుతీ నగర్ సుబ్రమణ్యం"లో ప్రధాన నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ఓ వీడియో చివర్లో ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ లుక్ లో ఎర్రటి లుంగీలో రావు రమేష్‌ ఉన్న వైబ్రాంట్ పోస్టర్ వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. పోస్టర్ రివీల్‌తో పాటు,ఆకర్షణీయమైన ప్రమోషనల్ వీడియోలో రావు రమేష్‌ని మూడు విభిన్న అవతారాలలో కనిపిస్తాడు.

Details 

విభిన్న క్యారెక్టర్ లతో రావు రమేష్ సంభాషణ 

KGF, రాఘవన్, విజయవాడ మావయ్య (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి) పాత్రల మధ్య జరిగే చమత్కార సంభాషణ మారుతీ నగర్ సుబ్రమణ్యంలో రావు రమేష్ ఆశాజనకమైన నటనకు వేదికగా నిలిచింది. చిత్రీకరణ పూర్తి కావడంతో, విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌లు కీలకపాత్రలలో నటించనున్నారు. బిఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్యా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల