సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
ఇప్పటివరకు కంగువ నుండి టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజైంది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, కంగువ నుండి జులై 23వ తేదీన ఒక అప్డేట్ రానుందని తెలుస్తోంది. అయితే ఆ అప్డేట్ ఏంటనేది తెలియడం లేదు.
కొలీవుడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం మేరకు కంగువ గ్లింప్స్ వీడియో రిలీజ్ కానుందని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ వస్తుందా లేదంటే సర్పైజ్ ఇస్తారా అనేది చూడాలి.
Details
గడిచిన కాలానికీ ప్రస్తుత కాలానికి మధ్య సంబంధంతో నడిచే కథ
కంగువ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం అనుకుంటోంది. మునుపెన్నడూ లేని విధంగా బాహుబలి సినిమాకు ధీటుగా కంగువ సినిమాలో విజువల్స్ ఉండనున్నాయట.
సూర్య మొదటిసారిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా నటిస్తోంది.
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా కంగువ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గడిచిపోయిన కాలానికీ, ప్రస్తుతానికి సంబంధం ఉండే కథగా కంగువ ఉండనుందని నిర్మాత ధనుంజయన్ వెల్లడి చేసారు.
2024 తొలిరోజుల్లో కంగువ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జులై 23న కంగువ నుండి అప్డేట్
MASSIVE #Kanguva surprise planned for July 23rd. pic.twitter.com/0cscbICZ1B
— Manobala Vijayabalan (@ManobalaV) July 12, 2023