Page Loader
Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ 
సైంధవ్ సినిమా నుండి సాయంత్రం రానున్న అప్డేట్

Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 12, 2023
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెంకటేష్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం సైంధవ్. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హిట్ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 4:05గంటలకు సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. సాయంత్రం వచ్చే అప్డేట్ టీజర్ కు సంబంధించినదై ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటివరకు సైంధవ్ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయింది. ఈసారి టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ ట్వీట్