LOADING...
Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్‌గా సంచలనం సృష్టించిన పూరి జగన్నాథ్‌కి స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో వెనుకబడిపోతున్నారు. ఆయన తరం దర్శకులు ఒక్కో హిట్‌తో తిరిగి ట్రాక్‌లోకి వస్తుండగా, పూరి మాత్రం తన సినిమాలతో నిరాశపరుస్తున్న పరిస్థితి. విడుదలకు ముందు భారీ హైప్‌ కలిగిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టకపోవడం వల్ల ఆయన కెరీర్ లో కొత్తగా సవాళ్లు ఎదురవుతున్నాయి. రామ్ పోతినేనితో తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏ చిత్రం కూడా విజయాన్ని చూడలేకపోయింది. లైగర్ లాంటి ప్రయోగాత్మక కథాంశం, డబుల్ ఇస్మార్ట్ వంటి సీక్వెల్ కూడా అతనికి విజయాన్ని అందించలేకపోయాయి.

Details

సహ నిర్మాతగా ఛార్మి కౌర్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మి కౌర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బెగ్గర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ మొదలైందన్న టాక్‌ ఉన్నప్పటికీ, తాజాగా ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమా టైటిల్‌ను 'భవతీ భిక్షాందేహి'గా ఖరారు చేసినట్టు వినిపిస్తోంది. పూరి సినిమాలకు వైవిధ్యభరితమైన పేర్లు పెట్టడంలో పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగ్ వంటి టైటిల్స్‌తోనే పూరి సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

ఈ నేపథ్యంలో 'భవతీ భిక్షాందేహి' అనే టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాధికా ఆప్టే, టబు వంటి బాలీవుడ్‌ నటి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.