ANAKAPALLI Teaser : మాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్న 'అనకాపల్లి' టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
'అనకాపల్లి' సినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ చిత్రంలో త్రినాథరావు నక్కిన ఓ కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. "అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటివారికి మనపై భయం ఉండాలి.
వివరాలు
వేసవిలో రిలీజ్
భయం లేనివారికి పిడికిలి రుచి చూపించాలి. అది తెలిసినవారికి ఓబీ రుచి చూపించాలి. అప్పటికీ లొంగకపోతే వారి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి. మనకి కావాల్సింది దక్కించుకోవాలనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. మొత్తంగా ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.