Page Loader
Anand Devarakonda: కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ
కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ

వ్రాసిన వారు Stalin
May 19, 2024
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదట్నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇటీవలే బేబి(Baby) సినిమాతో 100 కోట్ల భారీ హిట్ కొట్టాడు. త్వరలో ఆనంద్ దేవరకొండ 'గం..గం..గణేశా' సినిమాతో రాబోతున్నాడు. ఆనంద్ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ గం..గం..గణేశా(Gam Gam Ganesha) సినిమా తెరకెక్కుతుంది. గం..గం..గణేశా సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Details 

సిక్స్ ప్యాక్ బాడీ ఫోటో

ఇటీవలే మే 20న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అని, నిజంగా కండలు పెంచాను అంటూ తన సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోని షేర్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆనంద్ దేవరకొండ చేసిన ట్వీట్