Page Loader
Anant-Radhika's wedding:  అతిథులకు  Versace సన్ గ్లాసెస్ ఇచ్చినట్లు వెల్లడించిన యూట్యూబర్  
అతిథులకు Versace సన్ గ్లాసెస్ ఇచ్చినట్లు వెల్లడించిన యూట్యూబర్

Anant-Radhika's wedding:  అతిథులకు  Versace సన్ గ్లాసెస్ ఇచ్చినట్లు వెల్లడించిన యూట్యూబర్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముకేష్ అంబానీ,నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. జూలై 12న జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. జూలై 14న జరిగిన రిసెప్షన్‌లో అనేక మంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు "వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్" గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

అంబానీ-మర్చంట్  వివాహంలో డిజైనర్ సన్ గ్లాసెస్, నగలు 

వివాహ వేదిక లోపల ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అతిథులకు Versace డిజైనర్ సన్ గ్లాసెస్ అందించినట్లు యూట్యూబర్ ఆకాష్ సింగ్ వెల్లడించారు! రణవీర్ అల్లాబాడియా యూట్యూబ్ ఛానెల్ బీర్‌బైసెప్స్‌లో సింగ్ పంచుకున్నారు. "వారు డిజైనర్ సన్ గ్లాసెస్, వెర్సెస్ సన్ గ్లాసెస్ ఇస్తున్నారని నేను విన్నాను. వాటన్నింటికీ వసూలు చేయలేదు; వాటిలో కొన్ని వస్తువులు ఆలా ఇచ్చేవే."

వివరాలు 

వివాహ వేడుకలో ప్రముఖులు, గాయకులు 

ఈ వివాహానికి అలియా భట్, రణబీర్ కపూర్, AP ధిల్లాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా జోనాస్, నిక్ జోనాస్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జాన్ సెనా, కిమ్ కర్దాషియాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అంతులేని ఐశ్వర్యానికి పేరుగాంచిన అంబానీ-మర్చంట్ ల వివాహ వేడుకలు మార్చిలో జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి, ఇందులో రిహన్నా ప్రదర్శన ఉంది. ఆ తర్వాత, జస్టిన్ బీబర్ సంగీత్‌లో ప్రదర్శన ఇచ్చాడు. రిసెప్షన్‌లో శ్రేయా ఘోషల్, AR రెహమాన్ వంటి వారు కూడా ప్రదర్శనలు ఇచ్చారు.