Loading...
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్‌.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!
చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్‌.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!

Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్‌.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కాకా'. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'కాకా' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మూవీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వివరాలు

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తాజాగా యువ నటి అనస్వర రాజన్‌ పుట్టినరోజు సందర్భంగా 'కాకా' చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాలో అనస్వర రాజన్‌ 'అమ్ములు' అనే పాత్రలో కనిపించనుంది. ఆమెను ఎంబీబీఎస్‌ విద్యార్థినిగా, చిరంజీవి కూతురిగా పరిచయం చేశారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో అనస్వర రాజన్‌ సింపుల్‌, హోమ్లీ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక చిరంజీవి నిల్చున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.

దీంతో సినిమాలో చిరంజీవి, అనస్వర పాత్రల మధ్య ఎలాంటి ఎమోషనల్‌ బాండింగ్‌ ఉండబోతోందనే ఆసక్తి మొదలైంది.

ముఖ్యంగా 'అమ్ములు' పాత్ర కథలో కీలకంగా ఉండబోతోందని చిత్రబృందం వెల్లడించిన తీరు సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

వివరాలు

త్వరలోనే మరిన్ని అప్డేట్లు

మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

'కాకా'లో చిరంజీవి వంటి స్టార్‌ హీరోతో కలిసి నటించే అవకాశం ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్త యాక్షన్‌ అవతార్‌లో కనిపించనున్నారు.

నివేదా పేతురాజ్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లో 'కాకా'కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ అభిమానులను అలరించనున్నాయి.

ADVERTISEMENT