తదుపరి వార్తా కథనం

Andhra Pradesh: బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 06, 2025
04:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ప్రభుత్వ కాలంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.
గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 11 రకాల ముఖ్యమైన వస్తువులతో కూడిన బేబీ కిట్లు పంపిణీ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ పథకాన్ని నిలిపివేయగా, తాజాగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.