Page Loader
Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో
Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో

Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో

వ్రాసిన వారు Stalin
Apr 06, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్ష్యాన్నిచేరుకోవాలంటే ఎన్నికష్టాలు వచ్చి నా ముందుకు సాగాలి అనే స్ఫూర్తిగా ఉండే అందుకోవా అనే పాటను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. ఇప్పుడిది యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. సినీ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సారంగ దరియా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అబ్బిశెట్టి పద్మారావు దర్శకత్వం వహిస్తున్నారు. కాాగా పద్మారావు తొలి డెబ్యూ ఫిల్మ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఎంచుకోవడం ఆయనకు ప్లస్సే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Song Release

మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సినిమా

షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. అయితే ఈ చిత్ర యూనిట్ తాాాజాాగా విడుదల చేసిన 'అందుకోవా' అనే లిరికల్ సాంగ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే కథ అని లిరిక్స్ ను బట్టి అంచనావేయవచ్చు. ఇంచుమించు చిత్రయూనిట్ వదిలిన పోస్టర్స్ కూడా మిడిల్ క్లాస్ నేపథ్యాన్నే చూపిస్తున్నాయి. కాగా, ఇందులో రాజారవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,చందు, యశస్విని, నీలప్రియ, కాదంబరి కిరణ్, అనంతబాబు,విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు.