LOADING...
MEGA 157 : చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అభిమానుల్లో భారీ హైప్!
చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అభిమానుల్లో భారీ హైప్!

MEGA 157 : చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అభిమానుల్లో భారీ హైప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' అనే ప్రాజెక్ట్‌తో మంచి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు మెగాస్టార్‌తో పని చేస్తున్నందున సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరంజీవి స్కూల్‌లో పిల్లలకు ఆటలు నేర్పించే 'డ్రిల్ మాస్టర్' పాత్రలో కనిపించబోతున్నారు.

Details

శంకర్ వర ప్రసాద్ పాత్రలో చిరంజీవి

దీంతో వింటేజ్ చిరంజీవి మళ్లీ తెరపై అలరించబోతున్నారని మెగా అభిమానులు ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఓ టీవీ ఛానెల్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో, నిర్మాత సుష్మిత కొణిదెలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంలో మెగా 157 టైటిల్‌పై ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. చిరంజీవి ఇందులో 'శంకర వరప్రసాద్' అనే పాత్రలో కనిపించబోతున్నారని, సినిమా టైటిల్ కూడా అదే నేపథ్యంతో ఉంటుందని సూచించారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని అనిల్ రావిపూడి చెప్పడం, టైటిల్‌ను పరోక్షంగా బయటపెట్టినట్టే అయింది.

Details

వచ్చే సంక్రాంతికి రిలీజ్

అంతేకాక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. అదేకాక, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామని కీలక అప్డేట్‌ను కూడా ఇచ్చారు. ఈ మొత్తం సమాచారం బయటకు రావడంతో, మెగాస్టార్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, కొత్త అప్డేట్స్‌తో హైప్ మరింత పెరిగింది.