Page Loader
Animal: నేడు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న మహేశ్ బాబు, రాజమౌళి
హాజరుకానున్న మహేశ్ బాబు, రాజమౌళి

Animal: నేడు యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న మహేశ్ బాబు, రాజమౌళి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 27, 2023
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ కథానాయకుడు రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానున్న యానిమల్ సినిమాకు అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ఈ సినిమాకు జోరుగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‍లో నవంబర్ 27 యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను భారీగా నిర్వహిస్తోంది. దూలపల్లిలో ఉన్న మల్లా రెడ్డి వర్సిటీలో సాయంత్రం యానిమల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సందర్భంగా ఈవెంట్‍పై ఆసక్తి అమాంతం పెరగడం గమనార్హం.

DETAILS

(SSMB 29) గురించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం

మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి, తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయనున్నారు. దీంతో మహేశ్‍, రాజమౌళి సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. మహేశ్ 29వ మూవీ (SSMB 29)గా ఉండనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్'పైకి వెళ్లనుంది. యానిమల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మహేశ్, రాజమౌళి ఇద్దరూ రానున్నారు. దీంతో ఈ కాంబోలో వస్తున్న మూవీ గురించి గుడ్ న్యూస్ అందిస్తారని అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబుతో సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాజమౌళి రెడీ అయ్యారు. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా నేపథ్యంలో కథ ఉంటుందని ఇప్పటికే ప్రకటించేశారు. స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు కొలిక్కి వచ్చేశాయట.