Animal Movie : 'యానిమల్' అనేది సినిమా కాదు.. రాంగోపాల్‌వర్మ సంచలన రివ్యూ
'యానిమల్' సినిమాను ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చూశారట. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్,రష్మిక మందన్న జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చాలా కాలం పాటు ఈ మూవీకి సంబంధించిన వాదనలు పలు సందర్భాల్లో ప్రస్తావనకు వస్తాయన్నారు. 'యానిమల్ అనేది సినిమా కాదు. ఓ సోషల్ స్టేట్‌మెంట్' అని కితాబిచ్చారు. నాకు సినిమాలోని కథ, తండ్రీ కొడుకుల అనుబంధం ఏమంత ఎక్కలేదు కానీ, పాత కథా వస్తువుల్ని బేస్‌గా చేసుకుంటూ సందీప్ గతంలో ఎన్నడూ లేని సీన్లని అద్భుతంగా చూపించడం బాగుందన్నారు. సినిమా అంటే ఇలాగే ఉండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడన్నారు. చాదస్తపు నైతిక విలువులన్నింటినీ చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేశాడన్నారు.