Animal Twitter Review: 'యానిమల్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఉందంటే..?
'యానిమల్' (Animal) మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అర్జున్ రెడ్డి తరువాత సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ చిత్రం మీద ఇటు తెలుగులో, అటు హిందీ ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మికా మందాన్న(Rashmika Mandanna) హీరోయిన్లుగా నటించింన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలుచోట్ల ఈ చిత్రం ఫస్ట్ షో పడిపోయింది. ట్విట్టర్‌లో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ చెబుతున్నారు. ఇక మరోవైపు వయోలెన్స్ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.