
Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. హృదయానికి హత్తుకునేలా యానిమల్ 3వ పాట
ఈ వార్తాకథనం ఏంటి
రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్-డ్రామా 'యానిమల్'.
బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఈ సినిమాలోని మూడవ సింగిల్ 'నాన్ననువ్వు నా ప్రాణం'ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట అనిల్ కపూర్ పోషించిన తండ్రి పాత్ర, రణబీర్ కపూర్ పోషించిన కొడుకు మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది.
హృదయానికి హత్తుకునేలా ఉన్న పాటను సోనూ పాటడారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
నిత్యం పనిలోనే నిమగ్నమై తండ్రితో సమయం గడపాలనే కొడుకు ఇతివృత్తం ఆధారంగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందిచారు.
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు సింగల్స్ కూడా సిట్యుయేషనల్ పాటలే.
యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'నాన్ననువ్వు నా ప్రాణం' సాంగ్
Let the music weave emotions that resonate with the beautiful bond between generations. 🎶❤️
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 14, 2023
Here's 3rd Single from #AnimalTheFilm, #NannaNuvNaaPranam
-https://t.co/n5kXU3piWT#Animal3rdSong #Animal #AnimalOn1stDec @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/07CyV0wiaH