Page Loader
యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం 
యానిమల్ టీజర్ విడుదల

యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 28, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన చిత్రం యానిమల్. రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ని, రణ్ బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసారు. యానిమల్ టైటిల్ కి తగినట్టుగానే టీజర్ లో వయలెన్స్ అంశాలు ఎక్కువగా కనిపించాయి. తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ఈ సినిమాలో ఉండనుందని టీజర్ లో అర్థమవుతుంది. టీజర్ చివర్లో కనిపించిన సీన్లు, యానిమల్ సినిమా రివేంజ్ డ్రామాగా రూపొందిందని తెలియజేస్తున్నాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్