Animal Trailer : యానిమల్ ట్రైలర్'కు ముహుర్తం ఖరారు.. ఆసక్తికరంగా రష్మిక పాత్ర
రష్మిక మందన్న, రణ్ బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన యానిమల్ సినిమా ట్రైలర్' విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి డేట్ వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్'తో ఈ సినిమాపై బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు మించిపోతున్నాయి. నవంబర్ 23న యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది. లవ్, రొమాన్స్, యాక్షన్, ఫాదర్ సెంటిమెంట్ మెండుగా ఉండనున్నాయి. ఇదే సమయంలో పాటలు, టీజర్స్ సైతం విడుదలై ఆకట్టకున్నాయి. ఈనెలలోనే యానిమల్ ట్రైలర్ రిలీజ్ కానుండటంతో సినీ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, ఫ్యాన్స్
యానిమల్ ట్రైలర్ విడుదల కోసం ఓవైపు రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిందీ, తెలుగు సినీ ప్రేక్షకులు సైతం యానిమల్ కోసం ఉత్కంఠగా వెయిటింగ్'లో ఉన్నారు. మరోవైపు యానిమల్ సినిమా, మాత్రం ఈ ఏడాది ఆఖరి నెల డిసెంబర్'లో రిలీజ్ కానుంది. ఈ మేరకు 1న పాన్ ఇండియా రేంజ్'లో రిలీజ్ అవనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుయ్యాయి. ఈ మధ్యే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి యానిమల్ మూవీ యూనిట్ మొత్తం వచ్చి సందడి చేశారు. అందులో భాగంగా ప్రోమో కూడా రిలీజ్ చేయడం విశేషం.