తదుపరి వార్తా కథనం

Na Sammi Ranga: 'నా సామిరంగ' నుంచి అంజిగాడు గ్లింప్స్ వీడియో వచ్చేసింది
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 15, 2023
02:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగా'(Na Sammi Rang). విజయ్ బిన్నీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథనాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్(Allari Naresh) కీలక పాత్రలో నటిస్తున్నారు.
'నా సామి రంగ' సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నరేష్ 'అంజిగాడు' పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మూవీ టీం విడుదల చేసింది.
Details
సూపర్ ఎనర్జిటిక్ గా అల్లరి నరేష్
ఈ వీడియోలో అల్లరి నరేష్ సూపర్ ఎనర్జిటిక్ గా ఉన్నారు.
కింగ్ నాగార్జునతో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
మరోసారి నరేష్ తనదైన మార్క్ ను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమాకు సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు.