Loading...
Pawan Kalyan Divorce: విడాకుల ప్రకటనకు ముందే అన్నా కొణిదెల కీలక నిర్ణయం.. అప్పుడే సంకేతాలిచ్చారా?
విడాకుల ప్రకటనకు ముందే అన్నా కొణిదెల కీలక నిర్ణయం.. అప్పుడే సంకేతాలిచ్చారా?

Pawan Kalyan Divorce: విడాకుల ప్రకటనకు ముందే అన్నా కొణిదెల కీలక నిర్ణయం.. అప్పుడే సంకేతాలిచ్చారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారం, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. 2013 సెప్టెంబర్‌లో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వివరాలు

పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయం

తమ విడాకుల నిర్ణయంపై పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల ఉమ్మడి ప్రకటనలో స్పందించారు.

''జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రయాణాన్ని పంచుకున్న తర్వాత, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం.

మా వివాహ బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా, మా పిల్లలకు బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతాం. పిల్లల ఆనందం, వారి భవిష్యత్తు, శ్రేయస్సే మా ఉమ్మడి ప్రాధాన్యత. జీవితంలో చోటుచేసుకున్న ఈ వ్యక్తిగత మార్పు సమయంలో మా నిర్ణయాన్ని అర్థం చేసుకుని, మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం.

ఇప్పటివరకు మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులకు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పొలెనా అంజనా పవనోవా ఉన్నారు.

వివరాలు

గతంలో అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేషన్

మరోవైపు, గత అక్టోబర్ నెలాఖరులో అన్నా కొణిదెల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె ఖాతా కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే అప్పట్లో దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

తాజాగా పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన వెలువడటంతో.. అప్పట్లో ఆమె సోషల్ మీడియాకు దూరం కావడానికి ఇదే కారణమై ఉంటుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ADVERTISEMENT