Anna Lezhneva: చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిలో అన్నా లెజినోవా సందడి.. ఫోటోలు వైరల్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 30, 2026
09:39 am
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్ నగరంలో ఉన్న చారిత్రాత్మక వెయ్యి స్తంభాల ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించారు. ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటూ అక్కడి శిల్పకళా వైభవాన్ని ఆసక్తిగా పరిశీలించిన ఆమె, ఆ అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్వాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్శనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.