LOADING...
Anna Lezhneva: పవర్ స్టార్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ విషయం బయటపెట్టిన పవన్ భార్య
పవర్ స్టార్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ విషయం బయటపెట్టిన పవన్ భార్య

Anna Lezhneva: పవర్ స్టార్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ విషయం బయటపెట్టిన పవన్ భార్య

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఉన్న ప్రేమ గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంభాషణలో ఒక అభిమాని "మీరిద్దరిలో ముందుగా ప్రేమను వ్యక్తపరిచింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే మొదట ప్రపోజ్ చేశారా?" అని ప్రశ్నించగా, అన్నా లెజ్నెవా "అవును, ఆయనే మొదటగా తన ప్రేమను తెలియజేశారు" అని స్పష్టంగా చెప్పారు.

వివరాలు

అత్తగారి దగ్గర వంట నేర్చుకున్నా..

దీంతో వారి ప్రేమ కథపై అభిమానులకు మరింత క్లారిటీ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాషలపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా, తనకు మొత్తం ఆరు భాషలు తెలిసినట్లు ఆమె వెల్లడించారు. అయితే రోజువారీ సంభాషణల్లో తాను ప్రధానంగా ఇంగ్లీష్‌నే ఉపయోగిస్తానని చెప్పారు. తెలుగు భాష గురించి మాట్లాడుతూ.. "నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేను ప్రతిరోజూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉన్నాను" అని తెలిపారు. వంటల విషయానికి వస్తే.. తన అత్తగారు అంజనా దేవి దగ్గర ఎన్నో వంటకాలు నేర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను దోస, ఇడ్లీ, చట్నీలు మాత్రమే కాకుండా పప్పులు, వివిధ కూరలు కూడా సులభంగా వండగలుగుతున్నానని తెలిపారు.

వివరాలు

ఈ వంటలంటే పవర్ స్టార్‌కి ఇష్టం..

అంతేకాకుండా గోంగూర, పాలక్ పన్నీర్, బిర్యానీ, చేపల పులుసు వంటి రుచికరమైన వంటకాలను కూడా స్వయంగా తయారు చేయగలనని వెల్లడించారు. ముఖ్యంగా శాకాహార వంటకాలపై తనకు మంచి పట్టు ఉందని ఆమె పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన వంటకాల గురించి అడిగినప్పుడు, అన్నా లెజ్నెవా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "పవన్ గారికి మా అత్తగారు చేసే మసాలా చికెన్ కూర చాలా ఇష్టం. ఆ వంట విధానాన్ని కూడా నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను" అని చెప్పారు. అదేవిధంగా సురేఖమ్మ తయారు చేసే చేపల పులుసు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా తింటారని ఆమె తెలిపారు.

Advertisement