
Rashmika Mandanna: రష్మికను వదలని కేటుగాళ్లు.. మరో ఫేక్ వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై బాలీవుడు ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా స్పందించారు.
తాజాగా ఆ ఘటన మరవకముందే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది.
ప్రస్తుత వీడియోలో రష్మిక జిమ్ సూట్ ధరించి డాన్స్ చేస్తున్నట్లు సృష్టించారు.
దీనిపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని, దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు.
రష్మికను కావాలనే కొందరు టార్గెట్ చేశారని, ఆమెను డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అభిమానులు మండిపడుతున్నారు.
Details
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు
ఇటీవలే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని యాడ్ చేసి ఓ వీడియోను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ డీప్ ఫేక్ ఫోటో కూడా ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
'టైగర్ 3' సినిమాలోని టవల్ ఫైట్ ఫోటోను తీసుకుని, లో దుస్తుల్లో ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు.
ఇలాంటి డీఫ్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.