Sivakarthikeyan: తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో.. అభిమానులతో శివకార్తికేయన్ సమావేశం!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలోకి హీరో శివకార్తికేయన్ కూడా చేరారు. ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో నిర్వహించిన ఈసమావేశానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి శివకార్తికేయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను పీపుల్ మేడ్ స్టార్‌ని. మీ వల్లే ఈ స్థాయికి వచ్చాను. ఏ రంగంలోనైనా మన లక్ష్యంపై క్లారిటీ ఉండాలి. విమర్శించే వాళ్లు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. వారిని పట్టించుకోకుండా మనందరం ప్రేమతో కలిసి ఉండాలని సూచించారు. అనంతరం సమావేశానికి హాజరైన విద్యార్థులతోనూ శివకార్తికేయన్ మాట్లాడారు.
వివరాలు
తమిళనాడులో ఆసక్తికరంగా మారిన ఫ్యాన్ మీట్‌లు
''బాగా చదవండి. బాగా సంపాదించండి. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మనం ఎంత ఎక్కువ చదివితే.. మన ఆలోచనా విధానం అంత మెరుగవుతుంది. దీని వల్ల సోషల్ మీడియాకూ దూరంగా ఉండొచ్చని అన్నారు.
ప్రస్తుతం తమిళనాట హీరోలు నిర్వహిస్తున్న ఫ్యాన్ మీట్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల హీరోలు ధనుష్, విశాల్ కూడా తమ అభిమానులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రజాసేవలో భాగం కావాలని వారు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ కూడా తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు.