Page Loader
దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 
దర్శకుడిగా మారబోతున్న ధన్ రాజ్

దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 09, 2023
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో కనిపించే నటులకి సినిమాల్లో కనిపించే నటుల కన్నా ఎక్కువ పాపులారిటీ ఉంది. అయితే ఈమధ్య జబర్దస్త్ కమెడియన్లు దర్శకులుగా మారుతున్నారు. జబర్దస్త్ కమెడియన్ వేణు, బలగం సినిమాతో దర్శకుడుగా మారి పెద్ద హిట్టు అందుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన బలగం మూవీ, బ్లాక్ బస్టర్ స్థాయిని దాటిపోయి అమోఘమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడిగా మారబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ కమెడియన్ ఎవరో కాదు. ధనాధన్ ధన్ రాజ్ గా జబర్దస్త్ లో నవ్వులు పంచిన ధన్ రాజ్ దర్శకుడిగా మారుతున్నాడు.

Details

సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 

ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ లో కమెడియన్ గా చేయడం లేదు. ఇటు సినిమాల్లోనూ ధనరాజ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దర్శకుడిగా మారుతున్నాడు. ఇటీవల విమానం సినిమా షూటింగులో నటుడు సముద్రఖనికి ధన్ రాజ్ కథ వినిపించాడట. ఆ కథ సముద్రఖనికి బాగా నచ్చిందట. దాంతో వెంటనే సినిమాలో నటించేందుకు సముద్రఖని ఒప్పుకున్నారట. సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ దసరా తర్వాత మొదలు కాబోతుందని వినిపిస్తుంది. దసరా రోజున లాంచనంగా షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెబుతున్నారు.