OG: 'ఓజీ'లో మరో స్టార్ హీరో..? ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ సుజీత్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై యాక్షన్ చిత్రం 'OG'. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా షూటింగ్ మొదట అనుకున్న సమయంలో ప్రారంభమైనా, పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల కొన్ని నెలల పాటు నిలిపివేశారు. కానీ తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. డివీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న అతి భారీ యాక్షన్ సీన్స్‌లో తాజాగా పవన్ కళ్యాణ్ లేని భాగాలను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. కానీ ప్రస్తుతం OG చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో హాట్ న్యూస్ సెన్సేషన్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ తో జత కట్టనున్న ప్రభాస్?
పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ సినిమాలో మరొక స్టార్ హీరో ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ కోసం ప్రభాస్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సుజీత్ ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని చేస్తున్న సాన్నిహిత్యంతో ప్రభాస్ కథను వినిపించగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ విన్పిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా OG చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అకిరా నందన్ కూడా నటిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుండి రాలేదు.