
Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్
ఈ వార్తాకథనం ఏంటి
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే.
'దేవర' పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి.
Details
సెప్టెంబర్ మొదటి వారంలో మూడో పాట రిలీజ్
తాజాగా, 'దేవర' మూడో సాంగ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ అవుతోంది.
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ఆకౌంట్ ద్వారా మూడో పాట గురించి ఓ హింట్ ఇచ్చాడు.
మూడో పాట పాటకు మించిన ఆట అని, తారకరాముడు ఒక ఆట అడుకున్నాడని చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడని అడక్కండని ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మూడో పాట సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.