LOADING...
OG : పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'లో మరో కత్తిలాంటి హీరోయిన్ కన్ఫర్మ్!
పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'లో మరో కత్తిలాంటి హీరోయిన్ కన్ఫర్మ్!

OG : పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'లో మరో కత్తిలాంటి హీరోయిన్ కన్ఫర్మ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా కోసం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా ఉన్న విషయం ఇప్పటికే తెలిసింది. అయితే తాజాగా మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో నేహా శెట్టి ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. నేహా శెట్టి ఈ మూవీ లో కొన్ని సీన్లలో పాటు స్పెషల్ సాంగ్ చేస్తారని ఆమె స్వయంగా ప్రకటించారు. అందాల పరంగా బోల్డ్ స్టైల్ కలిగిన నేహా శెట్టి, ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టే అవకాశముందని చెప్పవచ్చు. ఆమె కత్తిలాంటి అందాలతో, ఈ సాంగ్ ప్రేక్షకులకు విశేషమైన విజువల్ ట్రీట్ కాబోతోంది.

Details

మూవీ పనుల్లో వేగం పెరిగింది

రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో మూవీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తి చేసుకుంటున్నారట. స్పెషల్ సాంగ్ ఫైనల్ వర్క్స్, రీ రికార్డింగ్ పనులు కూడా ఒకే సమయం లో పూర్తి చేస్తున్నారు. అన్ని పనులను సమయానికి పూర్తిచేసి రిలీజ్‌కి సిద్ధం కావాలని దర్శక, ప్రొడక్షన్ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Details

'ఓజీ'లో పవన్ పాత్ర

సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు నేహా శెట్టి అందాలు, స్పెషల్ సాంగ్ డబుల్ ట్రీట్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.