Page Loader
sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ ఫైట్, స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుముశాడు. బెంగళూరులోని తన నివాసంలో కార్డియాక్ అరెస్టు (గుండెపోటు) తో మరణించాడు. జాలీ బాస్టియన్ కన్నడలో ఫైట్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో ఆయన 900కు పైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. భారీ బైకులు, వాహనాలతో అవలీలగా స్టంట్స్ చేయడంలో జాలీ బాస్టియన్ దిట్ట. 300కు పైగా హై రిస్క్ బ్లాస్ట్ సీక్వెన్సులు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.

Details

చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు

టాలీవుడ్ లో అన్నయ్య,నక్షత్రం సినిమాలకు జాలి బాస్టియన్ ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన సెప్టెంబర్ 24న 1966లో కేరళలోని అలెప్పీలో జన్మించారు. మరోవైపు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఫైట్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. 'నినగాగి కాడిరువే' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాలి బాస్టియన్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.