LOADING...
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
దర్శకుడు ఎన్.ఎన్.ఆర్ ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఈ రెండేళ్లలో కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, శరత్ బాబు, విశ్వనాథ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మరో టాలీవుడు దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆర్యన్ రాజేష్ హీరోగా, డి.రామానాయుడు నిర్మించిన నిరీక్షణ సినిమాతో ప్రసాద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం శ్రీకాంత్ తో శత్రువు, నవదీప్ తో నటుడు అనే సినిమాలను డైరెక్ట్ చేశారు. 49 ఏళ్ల వయస్సులోనే ఆయన ఆకాల మరణం చెందడంపై పలువురు టాలీవుడు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Details

విషాదంలో టాలీవుడ్ ఇండస్ట్రీ

పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు చెందిన ప్రసాద్ పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్‌గా, ఘోస్ట్ రైటర్ పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రెక్కి' సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఆయన చివరి సినిమా రిలీజ్ కాకముందే అకాల మరణం పొందారు. ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రసాద్ మరణవార్త తెలుసుకున్న ఇండిస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.