Loading...
Anumana Pakshi Trailer: 'డీజే టిల్లు' దర్శకుడి నుంచి మరో డిఫరెంట్ మూవీ.. 'అనుమాన పక్షి' ట్రైలర్‌ అదుర్స్‌!

Anumana Pakshi Trailer: 'డీజే టిల్లు' దర్శకుడి నుంచి మరో డిఫరెంట్ మూవీ.. 'అనుమాన పక్షి' ట్రైలర్‌ అదుర్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

'డీజే టిల్లు' చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు విమల్‌ కృష్ణ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అనుమాన పక్షి'. టాలెంటెడ్‌ నటుడు రాగ్‌ మయూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

వివరాలు

అనుమానమే బలహీనతగా..

ట్రైలర్‌ను పరిశీలిస్తే.. కథ మొత్తం హీరో పాత్రకున్న 'అనుమానం' అనే బలహీనత చుట్టూనే తిరుగుతున్నట్లు అర్థమవుతోంది.

ప్రతి చిన్న విషయాన్నీ అనుమానించే వ్యక్తిగా రాగ్‌ మయూర్‌ నటన, ఆయన హావభావాలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో కేవలం కామెడీకి మాత్రమే దర్శకుడు పరిమితం కాలేదని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌, డార్క్‌ కామెడీ అంశాలను కూడా కథలో మేళవించినట్లు కనిపిస్తోంది.

వివరాలు

కీలక పాత్రల్లో ప్రముఖ నటులు

ఈ చిత్రంలో రాగ్‌ మయూర్‌కు జోడీగా మెరిన్‌ ఫిలిప్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రిన్స్‌ సెసిల్‌, బ్రహ్మాజీ, అజయ్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చిలకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో రాజీవ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సెప్టెంబర్‌ 18న థియేటర్లలోకి..

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన 'అనుమాన పక్షి' సెప్టెంబర్‌ 18న థియేటర్లలో విడుదల కానుంది.

'డీజే టిల్లు' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత విమల్‌ కృష్ణ ఎలాంటి వినోదాన్ని అందించబోతున్నారనే ఆసక్తితో సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు

ADVERTISEMENT