Page Loader
Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?
'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?

Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 24, 2023
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమానకు సంబంధించి చిత్రీకరణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనన్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే రెండు భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా 'దేవర' నిలువనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం.

Details

ఏప్రిల్ 5న దేవర రిలీజ్

దేవర 1 లో రెండు సీన్లకే పరిమితం అయ్యే రెండో హీరోయిన్, దేవర్ 2లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం దేవర సినిమాను రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.