Page Loader
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు 
అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్ విగ్రహావిష్కరణ

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 20, 2023
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుండి 2024 సెప్టెంబర్ 20వ తేదీ వరకు శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏయన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్ యూనిట్, ఇంకా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి, బ్రహ్మానందం, అల్లు అరవింద్, రామ్ చరణ్, మురళీ మోహన్, మహేష్ బాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, దిల్ రాజు, నాని, జగపతిబాబు, రానా తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్